Friday, September 20, 2024

జబర్దస్త్ ఆది పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షో తో పాటు కొన్ని సినిమాలలో కూడా నటిస్తున్నాడు ఆది. అయితే తన పంచులతో కడుపుబ్బ నవ్వించే ఆది పై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏసీపీ శ్రీధర్ రెడ్డి కి ఆది పై ఓ ఫిర్యాదు అందింది.

ఓ కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను హైపర్ ఆది కించపరిచేలా మాట్లాడారంటూ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా హైపర్ ఆది తో పాటు, స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్ పై ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇక గతంలో కూడా ఆది పై ఏఆర్ సి పి లో ఫిర్యాదు అందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement