Home సినిమా TG | సంధ్య థియేటర్ ఘటనపై కేసు న‌మోదు…

TG | సంధ్య థియేటర్ ఘటనపై కేసు న‌మోదు…

0
TG | సంధ్య థియేటర్ ఘటనపై కేసు న‌మోదు…

పుష్ప సినిమా ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తోపులాట‌లో ఓ మ‌హిల మృతి చెందిన ఘ‌ట‌న‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను వెల్లడించిన సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌కి వస్తున్న‌ సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని… అదేవిధంగా థియేట‌ర్ వ‌ద్ద‌కు అల్లు అర్జున్ వ‌స్తున్న‌ విషయాన్ని పోలీసులకు స‌రైన స‌మయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదు చేసిన‌ట్లు డీసీపీ తెలిపారు.

Exit mobile version