Thursday, November 28, 2024

నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మశ్రీరెడ్డి శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప‌హముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు శ్రీరెడ్డిపై అనకాపల్లి పోలీస్ స్టేషన్‌లో టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, చెన్న సత్యవతి, యర్రంశెట్టి ఈశ్వరి, కె.వసంత ఫిర్యాదు చేశారు. మరోవైపు నాలుగు రోజుల కిందటే సోషల్ మీడియాలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమించాలని శ్రీరెడ్డి కోరారు. భవిష్యత్తులో ఇలా చేయనంటూ వీడియో విడుద‌ల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement