Tuesday, November 26, 2024

ఆయ‌న‌కి 84..ఆమెకి 29.. నాలుగ‌వ‌సారి తండ్రికానున్న న‌టుడు

వ‌య‌సుతో ప‌నేముంది డ‌బ్బుంటే అన్నట్టుగా ఉంటుంది హాలీవుడ్ లో ప‌లువురి న‌టుల తీరు. అదే త‌ర‌హాలో 84ఏళ్ల వ‌య‌సులో నాలుగోసారి తండ్రి కాబోతున్నాడు హాలీవుడ్ హాలీవుడ్ గ్రేటెస్ట్ నటుడు అల్ పాచినో . ఆయన 29 ఏళ్ల గాళ్‌ఫ్రెండ్ నూర్ అల్‌ఫాల్లా ప్రస్తుతం గర్భవతి అని, మరో నెల రోజుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతున్నదని సమాచారం. నూర్ గతేడాది ఏప్రిల్ నుంచి పాచినోతో కలిసి ఉంటోంది. ఆమెకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. వారిలో ఇద్దరు బేవెర్లీ డి ఏంజిలో (71)తో కాగా, ఒకరిని జాన్ టారెంట్‌తో కంది. నాలుగోసారి బిడ్డకు జన్మనిస్తున్నట్టు నూర్ నిర్ధారించినట్టు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. నూర్ తరచూ డబ్బున్న వృద్ధులతో డేటింగ్ చేస్తూ ఉంటుంది. కరోనా సమయంలో అల్ పాచినో, నూర్ కలుసుకున్నారని, ఆ తర్వాతి నుంచి ఇద్దరు కలిసి ఉంటున్నట్టు వివరించాయి. అంతకుముందు ఆమె మిక్ జాగెర్‌తో కొన్నాళ్లు, ఆ తర్వాత నికోలస్ బెర్గ్యూయెన్‌తో డేట్ చేసినట్టు పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement