80మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుంది పల్సర్ బైక్ సాంగ్. అంటే ఎనిమిది కోట్ల మంది ఈ పాటను వీక్షించారు. ఈ సాంగ్ రిలీజై మూడు నెలలవుతున్నా ఇంకా దీని జోరు తగ్గడం లేదు. ఇక ఇదే సినిమాలోని జింతాక్ సాంగ్‌కు వంద కోట్ల మిలియన్‌ల వ్యూస్ వచ్చాయి. మాస్ మహరాజ్ రవితేజ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్‌లు రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది ధమాకా. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మించింది.తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమా వంద కోట్ల కలెక్షన్‌లు సాధించిందంటే మాములు విషయం కాదు. శ్రీలీల అందాలకు, డ్యాన్స్‌లకు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. రవితేజ ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్‌కు ఫిదా అయ్యారు.
ఇక ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ సంగీత దర్శకుడు భీమ్స్‌కే ఇవ్వాలి. ఈ సినిమా పాటలు ఒకదానికి మించి మరొకటి చార్ట్ బస్టర్‌గా నిలిచింది. మొత్తంగా ఆల్భమే హైలేట్. చాలా కాలం తర్వాత ఒక సినిమాలో అన్ని పాటలు చక్కగా కుదిరాయంటే అది ఈ సినిమాకు మాత్రమే. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలకు థియేటర్‌లో ఒక్కరు కూడా సీట్‌లలో కూర్చోలేరు. రవితేజ, శ్రీలీలతో పాటుగా కాళ్లు కదిపారు. ఈలలు, గోలలతో రచ్చ లేపారు. ముఖ్యంగా పల్సర్ బైక్ సాంగ్‌కు థియేటర్‌లో అభిమానులు చేసిన గోల అంతా ఇంతా కాదు. ఆల్రెడీ విన్న పాటే అయినప్పటికి భీమ్స్ తన స్టైల్ ఆఫ్ మిక్సింగ్, సౌండ్ డిజైన్‌తో ఓ రేంజ్‌లో మ్యూజిక్ ఇచ్చారు. దానికి ఏ మాత్రం తగ్గకుండా రవితేజ, శ్రీలీల డ్యాన్స్‌లు ఇరగదీశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుల్లో ఈ పాటను గుర్తు చేసుకోని వారు లేరు. అంతలా ఈ పాట ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.