ఎమ్ ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 6 డేస్ 7 నైట్స్. గోవాలో 100 మంది సభ్యులతో నాలుగు కెమెరాలతో ఈ సినిమా ప్రధాన షెడ్యూల్ ను పూర్తిచేశారు దర్శకుడు. కాగా తదుపరి షెడ్యూల్ ను మంగళవారం ఉడిపిలో ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయాలనే లక్ష్యంతో చిత్రయూనిట్ పనిచేస్తుంది.
వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు తనయుడు, నటుడు సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.