రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార’. పలు భాషల్లో రిలీజ్ అయ్యి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపేస్తోందీ ఈ మూవీ.. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ దీన్ని నిర్మించింది. ఇప్పటి వరకు తెలుగులో ‘కాంతార’ 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. KGF 2 తర్వాత తెలుగులో భారీ విజయాన్ని సాధించిన కన్నడ మూవీ ఇదే అంటున్నారు సినీ విశ్లేషకులు..
ఇక.. థియేటర్స్‌లో చూసినవారు, చూడని వారు.. ప్రతి ఒక్కరు ఈ సినిమాను మళ్లీ చూడాలని ‘కాంతార’ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే నవంబర్‌లో రెండు, మూడు డేట్స్‌లో వస్తుందని అందరూ భావించారు. అయితే డిస్ట్రిబ్యూటర్ష్ కోరిక మేరకు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు అఫీషియల్‌గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. రేపు అంటే నవంబర్ 24న ప్రముఖ ఓటీటీ చానెల్ అమెజాన్ ప్రైమ్‌లో ‘కాంతారా’ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్‌లో రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని సినీ అభిమానులు అంటున్నారు.