ట్రైలర్ తోనే దుమ్ము రేపుతోంది 2018చిత్రం. సర్వైవల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 2018. రెండు వారాల క్రితం మలయాళంలో విడుదలై అక్కడి బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. కేవలం రెండు వారాల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది. ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకుల నుండి డిమాండ్ రావడంతో తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ క్రమంలో పలు భాషలకు సంబంధించిన ట్రైలర్‌లను చిత్రబృందం విడుదల చేసింది. ఇక తెలుగులో తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన వస్తుంది. 2018 సంవత్సరంలో కేరళలో వచ్చిన వరదల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కేరళలో చుక్క నీరు లేని సమయంలో 26ఏళ్ల తర్వాత ఇడుక్కి అనే డ్యామ్‌ను తెరవడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక అదే టైమ్‌లో కేరళను వరదలు ముంచెత్తుతాయి.
ఆ వరదల వల్ల ఎంతో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది. ప్రజలు ఆ వరదలతో ఎలా పోరాడారు అనే అంశాలను ట్రైలర్‌లో కళ్లకు కట్టినట్లుగా చూపించారు.ట్రైలర్‌తోనే సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టోవినో థామస్, కుంజుకో బాబిన్, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించారు. మే 5న విడుదలైన ఈ సినిమా మాలివుడ్ అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్‌లో నిలిచిన సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా తర్వాత పులిమురుగన్, కురుప్ వంటి సినిమాలు ఉన్నాయి. సర్వైవల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో తెలుగులో రిలీజ్ కానుంది.