బాంద్రా ప్రాంతంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కాల్పుల అనంతరం ముంబయి నుంచి పరారైన వారు గుజరాత్‌లోని భుజ్‌లో చిక్కినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నామని, ముంబయికి తీసుకొచ్చి విచారిస్తామని పేర్కొన్నారు.
ఈ నిందితులు నవీ ముంబయి పన్వెల్‌లో ని హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు ఓ అధికారి తెలిపిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం పూర్వ యజమాని, మోటారు సైకిల్‌ను విక్రయించడంలో సహకరించిన ఏజెంట్‌ను విచారించారు.