Friday, November 22, 2024

Thaapsi: అత‌డితో 11 ఏళ్లు..మథియాస్ తో తాప్పీ బంధం..

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయ్యి.. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి అవకాశాలు దక్కించుకొని అక్కడికే వెళ్లి సెటిల్ అయిపోయిన హీరోయిన్స్లో తాప్సీ పన్ను కూడా ఒకరు. కంటెంట్ ఉన్న కథల్లో నటించి హిట్ కొట్టడంతో ప్రస్తుతం బాలీవుడ్లోనే తాప్సీ బిజీ అయిపోయింది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ పెద్దగా బయటపెట్టలేదు. కానీ తాజాగా తన బాయ్ఫ్రెండ్ ఎవరు, వారిద్దరూ ఎప్పటినుంచి కలిసుంటున్నారు లాంటి విషయాలపై ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది.

11 ఏళ్ల రిలేషన్షిప్..
చాలాకాలం క్రితం తాప్సీ.. యూరోప్కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తనను ప్రశ్నించగా.. రిలేషన్షిప్ విషయం నిజమే అని ఒప్పుకుంది కూడా. కొన్నాళ్లుగా మళ్లీ తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా విషయాలు ఏమీ బయటికి రాలేదు. తాజాగా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి తాప్సీని ప్రశ్నించగా.. ‘‘నేను గత పదేళ్ల నుంచి ఒక్క మనిషితోనే ఉన్నాను. 13 ఏళ్ల క్రితం నేను యాక్టింగ్ ప్రారంభించాను. బాలీవుడ్లో నా డెబ్యూ సమయంలో తనను కలిశాను. అప్పటినుంచి ఇప్పటివరకు అదే వ్యక్తితో ఉన్నాను’’ అంటూ తన లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గురించి చెప్పుకొచ్చింది తాప్సీ.
‘‘నాకు తనను వదిలేయాలని ఆలోచన లేదు. ఇంకొకరితో ఉండాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్లోనే నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అంటూ మథియాస్ బోతో తన రిలేషన్షిప్ చాలా బాగుందని బయటపెట్టింది తాప్సీ. ‘‘నేను ఇంకా ప్రెగ్నెంట్ కాదు. కాబట్టి ఇప్పట్లో పెళ్లి చేసుకోను. నాకు పిల్లలు కావాలి అనిపించినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటాను’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement