బాలీవుడ్ సీనియర్ నటుడు రాహుల్ రాయ్ స్పీచ్ థెరపీ తీసుకుంటున్నారు. బిగ్ బాస్ హిందీ సీజన్ 1 విన్నర్ రాహుల్ రాయ్ గత ఏడాది నవంబర్‌లో అస్వస్థతకు గురైయ్యారు. కార్గిల్ లో ఎల్ఏసీ..లైవ్ ది బ్యాటిల్ అనే సినిమా చేస్తున్న సమయంలో అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అతనిని ముంబై నానావతి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. డిసెంబర్‌లో డిశ్చార్జ్ అయిన రాహుల్ రాయ్‌కు ప్రస్తుతం మాట రావడం లేదు. ఈ క్రమంలో ఆయన సోదరి ప్రియాంక స్పీచ్ థెరపీ చేయిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. త్వరలోనే మళ్లీ మాములు స్థితికి వస్తానని చెప్పిన రాహుల్ అభిమానుల పూజలు, ప్రార్ధనలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. 2006లో మొదలైన బిగ్ బాస్ తొలి సీజన్ కంటెస్టెంట్ కమ్ విన్నర్ గా నిలిచిన రాహుల్ రాయ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆషిఖీ తర్వాత ఎందుకో రాహుల్‌కు చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో టీవీ షోలతోనే ఎక్కువగా కాలం వెళ్లదీస్తున్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement