ఆదివారం అంటే చాలు స్టార్ మా లో కొత్త కొత్త ప్రొగ్రామ్స్ తో సందడి చేస్తోంది. కాగా గత ఆదివారం ప్రారంభమైన సరికొత్త కార్యక్రమం ‘100% లవ్’కు కొనసాగింపుగా రెండో భాగం ఈ ఆదివారం అందించబోతోంది. ఈ ఆదివారం (ఫిబ్రవరి 28న) సాయంత్రం 6 గంటలకు ఈ గ్రాండ్ గాలా ఈవెంట్ స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. మీరా మేమా అనే రేంజ్లో తలపడుతున్న రియల్ కపుల్స్లో గెలుపు ఎవరిది అనే అంశం మాత్రం ఎటూ తేల్చుకోలేని స్థాయిలో పోటీ జరుగుతోంది. ఊహించని సెలబ్రిటీలు రావడం, పోటీలు విభిన్నంగా జరగడం, ఆటలు, పాటలు.. మొత్తం మీద ‘100% లవ్’ ఓ కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. సీనియర్ ప్రజంటర్ ఓంకార్ ప్రత్యేక ఆకర్షణగా రెండు జంటల మధ్య పోటీని పదునెక్కించారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ‘స్టార్ట్ మ్యూజిక్’తో ప్రముఖ యాంకర్ సుమ చేస్తున్న హంగామా, వర్షిణి వ్యాఖ్యాతగా చేస్తున్న కామెడీ స్టార్స్ అందిస్తున్న సందడి మామూలే. ఈ రెండు కార్యక్రమాలకు ‘100% లవ్’ కూడా తోడు కావడంతో ఆదివారం తమ ప్రేక్షకులకు సందడే సందడి అని స్టార్ మా పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement