Friday, November 22, 2024

స్టార్ కపుల్స్ విడిపోనున్నారా..

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన  హాలీవుడ్ ప్రముఖ స్టార్‌ కపుల్‌ కిమ్‌ కర్దాషియాన్, కేన్‌ వెస్ట్ విడిపోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. రెండేళ్ల డేటింగ్ త‌ర్వాత 2014లో ఇటలీ వేదిక‌గా వివాహం చేసుకున్న ఈ జంట ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించ‌కున్నార‌ట‌. ఇప్ప‌టికే కిమ్‌ కర్దాషియాన్ పిటిషన్‌ దాఖలు చేసిన‌ట్టు తెలుస్తుంది. మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ కపుల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కిమ్, కేన్‌కు కొన్నాళ్లుగా పొస‌గ‌డం లేదు. ఇద్ద‌రు వేరు వేరుగా ఉంటున్నారు. కిమ్ కర్దాషియాన్ తన  పిల్లల్ని తీసుకొని లాస్ ఎంజెల్స్‌లో ఉంటుండ‌గా,   కేన్‌ వెస్ట్ ప్రస్తుతం వోమింగ్‌లో ఒంటరిగా ఉంటున్నారు. గ‌తంలో కేన్ .. కిమ్‌తో పాటు ఆమె త‌ల్లి న‌న్ను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వారి ప్రవ‌ర్త‌న బాధ క‌లిగిస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ దంప‌తుల‌కు నార్త్(7), సెయింట్‌(5)తో పాటు 21నెలల కుమారుడు కూడా ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement