కొత్త దంపతులకు గిఫ్ట్ పంపారట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ నేపథ్యంలో హీరో సుమంత్ అశ్విన్- దీపికల పెళ్లికి ప్రభాస్ హాజరు కాలేకపోయాడు. దీంతో బొకేతో పాటు విలువైన బహుమతులు పంపాడు. ఈ విషయాన్ని సుమంత్ తండ్రి ఎంఎస్ రాజు తన సోషల్ మీడియాలో తెలిపారు. కొత్త దంపతులకు పంపిన గిఫ్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డార్లింగ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రభాస్‌కు ఎంఎస్ రాజు వర్షం, పౌర్ణమి అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement