Friday, November 22, 2024

షీ రాక్స్ ని ప్రారంభించిన ‘జాక్వెలిన్’

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండైజ్ షీ రాక్స్  ఫిట్నెస్ వర్కౌట్ ని స్టార్ట్ చేసింది. తన అభిమానులకు ఫిట్నెస్ తరగతులు చెప్పేందుకు సిద్ధమవుతోంది. అందుకోసం  తన కొత్త ఫిట్నెస్ వర్కౌట్ సిరీస్ షీ రాక్స్ ను ప్రారంభించింది. టీవీ.ఫిట్ ద్వారా TRUకనెక్ట్ అనే ఫిట్ నెస్ – వెల్ నెస్ కమ్యూనిటీ వేదికగా వర్కౌట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. షీ రాక్స్ ఫిట్నెస్ వర్కౌట్ సిరీస్ తన సొంత శిక్షణా విధానం అని జాకీ చెబుతోంది. ప్రతి వ్యాయామానికి కేవలం 20 నిమిషాల సమయం అవసరమని జాకీ చెబుతోంది. జాక్వెలిన్ షీ రాక్స్ ఫిట్నెస్ ప్రోగ్రాం ఆసియా అంతటా వైరల్ కానుంది.  లక్షలాది మందికి ఈ ప్రోగ్రామ్ స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నారు. ఇకపోతే జాక్విలిన్ తన వైపు అభిమానుల దృష్టిని ఆకర్షించేందుకు ఇదిగో ఇలా అదిరిపోయే భంగిమలతో వేడెక్కించేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement