Sunday, November 24, 2024

శ్రీముని తీరు నచ్చే పెళ్లి చేసుకున్నా..’రాశి’

ఎంతమంది ప్రపోజ్ చేసినా  అసిస్టెంట్ డైరెక్టర్  శ్రీముని ని ఎందుకు వివాహం చేసుకుందనే విషయమై సీనియర్ హీరోయిన్ రాశి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. అప్పట్లో ఎంతో మంది నాకు ప్రపోజ్ చేసినా కూడా నేను మాత్రం నా సినిమాలకు వర్క్ చేసిన శ్రీమునిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నా తండ్రి చనిపోయిన సమయంలో మానసికంగా నాకు అండగా అతడు నిలిచిన తీరు నచ్చింది. అందుకే నేనే స్వయంగా పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాను. అందుకు ఒప్పుకున్న శ్రీముని ఇరు వైపుల పెద్దలను ఒప్పించాడు. పెళ్లి తర్వాత రాశి భర్త కొన్ని సినిమాలు చేశాడు. అవి పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దాంతో మళ్లీ డైరెక్షన్ వైపు శ్రీముని వెళ్లింది లేదు.శ్రీమునిని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు రాశి ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడ్డట్లుగా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికారు చేశాయి. కోటీశ్వరులు క్యూ కట్టినా కూడా సహాయ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాశి నిజమైన ప్రేమకు ఆదర్శంగా నిలిచిందని అభిమానులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement