Saturday, November 23, 2024

వేశ్యగా వద్దన్నారు..

హీరోయిన్ అభితా వెంకట్ తనకి ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందో తెలిపింది. పలు రకాల ప్రకటనల్లో నటిస్తూ వస్తున్నా..సినిమాల్లో నటించాలన్న కోరిక ఉన్నా..ఎవరిని సంప్రదించాలో తెలియదు.  అలా కొన్నేళ్ళు గడిచి పోయాయి. అయితే, ఓ ప్రకటన వీడియో చూసి ‘కేరాఫ్‌ కాదల్‌’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. ఇది నా మొదటి చిత్రం.  తొలి చిత్రంలోనే వేశ్య పాత్రలో నటించవద్దని చాలా మంది వారించారు. కానీ, నేను ధైర్యం చేసి ఆ పాత్ర చేసేందుకు ముందుకు వచ్చాను. ఆ తర్వాత ‘కమలి ఫ్రమ్‌ నడుక్కావేరి’ చిత్రంలో నటించే ఛాన్స్‌ దొరిగింది. ఇది విభిన్నమైన పాత్ర. రెండు చిత్రాల్లో రెండు వేర్వేరు పాత్రల్లో కనిపించడం, ఆ పాత్రలకు మంచి ప్రశంసలు దక్కడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోత్సాహం మున్ముందు మరిన్ని మంచి పాత్రల్లో నటించేందుకు, కెరీర్‌ ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని భావిస్తున్నాను..” అని అభితా వెంకట్‌ చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement