Friday, September 20, 2024

వివాహ బంధంపై ‘ఉపాసన’

మా ఇద్దిర మధ్య ఎన్నో అపురూప క్షణాలున్నాయని తెలిపారు ఉపాసన. వివాహబంధంలో విభేదాలు రావడం సహజమని, రామ్‌చరణ్‌కు, తనకు కూడా అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని ఉపాసన చెప్పారు. వాలంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమ గురించి, వివాహ బంధం గురించి ఉపాసన మాట్లాడారు. వివాహం జరిగిన తర్వాత వచ్చిన మొదటి వాలంటైన్స్ డే సందర్భంగా చెర్రీ తనకు అపురూప కానుకను అందించారని, హృదయాకారంలో ఉన్న చెవి రింగులను తయారు చేయించి ఇచ్చాడని, అవి తనకు చాలా ప్రత్యేకమైనవిని ఉపాసన చెప్పారు. ఎనిమిదేళ్ల మా వైవాహిక బంధం చాలా సంతోషంగా గడిచింది. మా ఇద్దిర మధ్య ఎన్నో అపురూప క్షణాలున్నాయి. అలాగే మా ఇద్దరి మధ్య కూడా అప్పుడప్పుడు విభేదాలు వస్తుంటాయి. గొడవలు జరుగుతుంటాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడే ఆ బంధం మరింత బలోపేతమవుతుంది. వైవాహిక బంధంలో ఎదురయ్యే సమస్యలను మా ఇద్దరం కలిసి ఎదుర్కొంటూ విజయవంతంగా ముందడుగు వేస్తున్నామని ఉపాసన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement