ఇప్పటికే నిర్మాత సురేష్ బాబు పెద్ద తనయుడు రానా హీరోగా తనని తాను నిరూపించుకున్నాడు. తన చిన్న తనయుడు అభిరామ్ కూడా తెరంగ్రేటం చేస్తాడని ఇదిగో..అదిగో అంటూ వచ్చారు. రానా హీరోగా వచ్చిన తర్వాత వెనువెంటనే కాకపోయినా, కొంత కాలం తర్వాతైనా సరే అభిరామ్ హీరోగా వచ్చేస్తాడు అనుకున్నారంతా. ముఖ్యంగా సురేష్ యూనిట్ వాళ్లు. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. దానికి ముఖ్యమైన కారణం….సురేష్‌బాబు దేనికీ తొందరపడడు. ఆదుర్దా లేనేలేదు. తన కొడుకు కదా అని భుజాలమీదకి ఎక్కించుకోడు. ఆచితూచి అడుగు వెయ్యడం అనాదిగా ఆయన అలవాటు. ముఖ్యంగా తను బాగా వైబ్ కాకపోతే ప్రాజెక్టు ప్రారంభించలేని నైజం సురేష్‌బాబుది. అదే అభిరామ్ ప్రాజెక్టుని ఇన్నాళ్ళూ అడ్డుకుంది. రవిబాబు, సురేష్‌బాబుకి మధ్యన మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఉత్తినే కూడా వాళ్ళిద్దరూ ఏవో కథలు, స్టోరీ లైన్స్ చర్చించుకుంటుంటారు. అలా చర్చించుకున్నప్పుడు ఏదో సురేష్‌బాబుకి నచ్చిన పాయింటేదో తగిలుంటుంది. అభిరామ్ పంట పండింది. ఎలాగైతేనేం…..అభిరామ్ లైమ్‌లైట్‌కి వస్తున్నాడు. తర్వాత వివరాలు, విషయాలు త్వరలోనే తెలియనున్నాయి. రవిబాబు ఎక్స్‌పెన్సివ్ డైరెక్టర్ కాదు. కంటెంట్‌మీద ఎక్కువగా ఆధారపడతాడు. ఇప్పడు అల్లరి నరేష్ అని పరిశ్రమ, ప్రేక్షకులు పిలుస్తున్న ఇవివి సత్యన్నారాయణ కుమారుడు నరేష్‌ని కూడా రవిబాబే అల్లరి సినిమా ద్వారా పరిచయం చేశాడు. ఆ సెంటిమెంట్ కూడా సురేష్‌బాబు దృష్టిలో వర్కౌట్ అయి ఉంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement