Saturday, November 23, 2024

లేజర్ సర్జరీ చేయించుకుంటోన్న ‘అమితాబ్’

లేజర్ సర్జరీ చేయించుకుంటున్నారట బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.  తాజాగా త‌న బ్లాగ్ లో సర్జ‌రీ చేయించుకోబోతున్నాను, కొన్ని రోజులు బ్లాగ్‌కు దూరంగా ఉంటాన‌ని పేర్కొన్నారు. దీంతో అందరిలో ఆందోళ‌న నెల‌కొంది. త్వ‌ర‌గా ఆయ‌న కోలుకొని ఆసుప‌త్రి నుండి తిరిగి రావాల‌ని ఫ్యాన్స్ ప్రార్ధిస్తున్నారు.తాజాగా అమితాబ్ ఆరోగ్య ప‌రిస్థితిపై అత‌ని స‌న్నిహితులు స్పందించారు. కంటిలోని శుక్లాన్ని తొల‌గించుకునేందుకు ఆయ‌న లేజ‌ర్ స‌ర్జ‌రీ చేయించుకుంటున్నారు. ఈ స‌ర్జరీ పెద్ద కాంప్లికేట్ ఏమి కాదు. త్వ‌ర‌లోనే ఆయ‌న డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు. దీంతో అభిమానులు కాస్త ఉప‌శ‌మ‌నం పొందారు. ప్ర‌స్తుతం అమితాబ్ ..అజ‌య్ దేవ‌గ‌ణ్ డైరెక్ష‌న్‌లో మేడే అనే సినిమా చేస్తున్నాడు. త్వ‌ర‌లో నాగ్ అశ్విన్- ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న సినిమాలోను న‌టించ‌నున్నారు .అమితాబ్ న‌టించిన ‘ఝుండ్’  జూన్ 18న ‘చెహ‌రే’ ఏప్రిల్‌ 30న విడుదల కానున్నాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement