రెండోసారి కూడా మగబిడ్డకు జన్మనిచ్చారు బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్. శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కరీనా ఆదివారం ( ఫిబ్రవరి 21) పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు రిద్ధిమా కపూర్ తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.2012లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌లు పెళ్లి చేసుకోగా, 2016లో తైమూర్ అలీ ఖాన్ జన్మించారు. చిన్నప్పటి నుండి తైమూర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. త్వరలో ఈ చిన్నారి వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. కాగా, కరీనా కపూర్ ప్రస్తుతం అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement