Tuesday, November 26, 2024

రెండోపెళ్లికి రెడీ..’దియామీర్జా’

రెండో పెళ్లికి సిద్ధమవుతోంది బాలీవుడ్ హీరోయిన్ దియా మిర్జా. 2004 సంవ‌త్స‌రంలో నిర్మాత సాహిల్‌ సంఘాను పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల వైవాహిక జీవితం త‌ర్వాత వీరిద్ద‌రు ప‌లు కార‌ణాల వ‌ల‌న విడిపోయారు. అయితే విడాకుల అనంత‌రం వ్యాపారవేత్త   వైభవ్‌ రేఖీతో దియా ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు న‌డిచాయి. దీనిపై తాజాగా క్లారిటీ వ‌చ్చింది.  ఫిబ్ర‌వ‌రి 15న  ముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీతో ఏడ‌డుగులు వేసేందుకు సిద్ధ‌మైంది.  ఇరువురి కుటుంబాలు  వీరికి పెళ్ళికి అంగీకారం తెలపడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. కాగా దియా ప్రస్తుతం  తెలుగులో ‘వైల్డ్‌ డాగ్’‌ మూవీలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement