Thursday, September 19, 2024

యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తోన్న ‘క్రిష్’

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న చిత్రం యాక్షన్ సన్నివేశాల షూట్ జరుగుతోందట. ఈ మూవీలో హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. కాగా ఈ మూవీకి హరిహర వీరమల్లు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అంతేకాదు 17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది.  ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ పీరియాడిక్‌ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌.. మొఘల్‌ చక్రవర్తి జౌరంజేబు పాత్రలో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్‌, బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఒకవైపు ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పాటు, సాగర్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటూ పవన్‌కల్యాణ్‌ బిజీగా ఉన్నాడు పవన్‌కల్యాణ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement