Saturday, November 23, 2024

‘మీనా’ మేకప్ పై ట్రోలింగ్..

హీరోయిన్ మీనా మేకప్ పై ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం దృశ్యం2. ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. ఈ చిత్రం  మొదటి భాగానికి మించిన ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ సినిమాలో మీనా లుక్ మాత్రం విమర్శలకు గురవుతున్నారామె. మధ్య తరగతి గృహిణిగా కష్టాల్లో,చిక్కుకున్న ఇల్లాలి పాత్రలో నటించిన మీనా హెవీ మేకప్ తో కనిపించింది. సెంటిమెంట్ సన్నివేశాల్లో సైతం మీనా డార్క్ లిప్ స్టిక్,చెక్కుచెదరని మేకప్,హెయిర్ స్టైల్ తో కనిపించింది. దాంతో నెటిజన్లు మీనా లుక్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విమర్శలపై దృశ్యం2 డైరెక్టర్ జీతూజోసెఫ్ స్పందించారు..విమర్శకులతో ఆయన ఏకీభవించారు. అవును మీనా మేకప్ లేకుండా కనిపించాల్సింది. నేను షూటింగ్ సమయంలో ఆమెకు చెప్పాను..మేకప్ వద్దన్నాను. అయితే అందుకు మీనా ఒప్పుకోలేదు. మేకప్ లేకుండా నటించనని చెప్పారు. ఆమెను నేను కన్విన్స్ చేయలేకపోయాను. ఆర్టిస్ట్ సౌకర్యంగా లేకపోతే వారు సరిగ్గా పనిచేయలేరనే భావంతో నేను ఆమెతో ఆ విషయం గురించి ఆ తర్వాత చర్చించలేదని జీతూ చెప్పారు. ఈ సినిమా త్వరలో తెలుగులోకి రీమేక్ కాబోతోంది. సీనియర్ హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో జీతూజోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement