మార్చి 12న రిలీజ్ కానుంది లవ్ లైఫ్ అండ్ పకోడి చిత్రం. బిమల్ కార్తీక్ సంచిత జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు జయంత్ గాలి దర్శకత్వంతో పాటు స్వయంగా నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి సమర్పిస్తున్నారు. మహాశివరాత్రి శుభాకాంక్షలతో మార్చి 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి పవన్ సంగీతం అందించారు. సాగర్ వై.వి.వి జితిన్ మోహన్ ఛాయాగ్రాహకులుగా వర్క్ చేశారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. కాగా.. ఈ చిత్రం రిలీజ్ కు ఒకరోజు ముందు.. జాతి రత్నాలు, శ్రీకారం, గాలి సంపత్ విడుదల కాబోతున్నాయి. ఈ విధంగా ఫుల్ కాంపిటేషన్ లో బరిలోకి దిగుతున్న ఈ చిత్రం ఎలాంటి రిల్ట్ నమోదు చేస్తుందో చూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement