పర్సనల్ లైఫ్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది తమిళ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం ఆమె దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. వారిద్దరూ చెట్టా పట్టాలు వేసుకుని ఫెస్టివల్ సెలబ్రేషన్స్, విందులు, వినోదాలు వంటివి చేస్తూ ఫుల్ చిల్ అవుతుంది. వీరిద్దరి పెళ్లికి సంబంధించి కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నా దీనిపై ఇద్దరు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. తాజా సమాచారం ప్రకారం మార్చి నెలలో తన ప్రియుడితో కలిసి నయనతార పెళ్ళిపీటలెక్కనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాలు చేస్తుందట. అలానే భర్తతో కలిసి సినిమాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూటర్‌గాను కొనసాగాలన్న బలమైన పట్టుదలతో నయనతార ఉన్నట్టు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement