Thursday, September 19, 2024

మలయాళ ఇండస్ట్రీలోకి హాట్ యాంకర్

మలయాళ ఇండస్ట్రీలోకి యాంకర్..నటి అనసూయ అడుగుపెట్టనున్నారు. ఇటీవ‌ల థ్యాంక్యూ బ్ర‌ద‌ర్ అనే చిత్రంలో గ‌ర్భ‌వ‌తిగా న‌టించిన అన‌సూయ చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తుంది. ఇక రంగ‌మార్తాండ‌, పుష్ప‌, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌, ఖిలాడి చిత్రాల‌లో కీల‌క పాత్ర పోషిస్తుంది. అనసూయ అద్భుత‌మైన న‌ట‌న‌తో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల‌లోను ఆమెకు వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇటీవ‌ల విజ‌య్ సేతుపతి సినిమాలో న‌టించే ఛాన్స్ కొట్టేసిన అన‌సూయ ఇప్పుడు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలోను అడుగుపెట్టేందుకు సిద్ధ‌మైంది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి చిత్రం భీష్మ ప‌ర్వంలో కీల‌క పాత్ర‌కు ద‌ర్శ‌కుడు అమ‌ల్ నీర‌ద్ .. అన‌సూయ‌ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. ఏప్రిల్‌లో ఈమె షూటింగ్‌లో అడుగుపెట్ట‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement