Friday, November 22, 2024

మరోసారి ఫెఫ్సీ అధ్యక్షుడిగా ‘ఆర్.కె.సెల్వమణి’

మరోసారి ఫెఫ్సీ అధ్యక్షుడుగా ఆర్‌.కె.సెల్వమణి కొనసాగుతారు. ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (ఫెఫ్సీ)కి సంబంధించి 2021-23 సంవత్సరానికిగాను ఎన్నికలు ఏకగ్రీవంగా ముగి శాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు ఉన్న కమిటీనే తిరిగి ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. వాస్తవానికి ఈ నెల 14న ఫెఫ్సీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణి ఇటీవల ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా  ఏడో తేదీ ఆదివారం వెల్లడి స్తామని తెలిపారు. ఆ ప్రకారంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పాత ప్యానెల్‌ సభ్యులే ముందుకు వచ్చారు. దీంతో వారంతా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆదివారం ప్రకటించారు. దీంతో 2021-23 సంవత్సరానికిగాను మరోమారు ఫెఫ్సీ అధ్యక్షుడుగా ఆర్‌.కె.సెల్వమణి కొనసాగుతారు. అలాగే, ప్రధాన కార్యదర్శిగా అంగముత్తు షణ్ముగం, కోశాధికారిగా పీఎన్‌.స్వామినాథన్‌ ముచ్చటగా మూడోసారి ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు.  ఉపాధ్యక్షులుగా ధినా, జె.శ్రీధర్‌, ఎస్‌పి.సెంథిల్‌ కుమార్‌, వి.దినేష్‌ కుమార్‌, తవసి రాజ్‌, సం యుక్త కార్యదర్శులుగా ఏ.శబరిగిరీశన్‌, ఏ.శ్రీనివాసమూర్తి, ఏ.పురుషోత్తమన్‌, జి.సెంథిల్‌ కుమార్‌, కె.శ్రీప్రియ ఎన్నికయ్యారు. కాగా, కొత్తగా ఎన్నికైన ఫెఫ్సీ కొత్త కార్యవర్గ సభ్యులను తమిళనాడు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎన్‌.రామస్వామి, తమిళనాడు దర్శకుల సంఘ కార్యదర్శి ఆర్‌.వి.ఉదయకుమార్ కొన‌సాగ‌నున్నారు. ఈ కొత్త కార్యవరం ప్రమాణ స్వీకారోత్సవం త్వరలో జరుగనుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement