Tuesday, November 26, 2024

భవ్య బిష్ణోయ్ తో ‘మెహ్రీన్’ పెళ్లి

హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాది తర్వలో పెళ్లి పీటలెక్కబోతోందట. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్‌లాల్ బిష్ణోయ్ కుటుంబంలోకి మెహ్రీన్‌ వెళ్తున్నది. భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌ను ఆమె పెళ్లాడనుంది. మార్చ్ 13న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లాలో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరగనుంది. ఇరు కుటుంబాల సభ్యులు మరికొందరు సన్నిహితులు మాత్రమే ఈ వేడుక హాజరుకానున్నట్లు సమాచారం. నిశ్చితార్థం అనంతరం పెళ్లి తేదీ ప్రకటించనున్నారు. కొన్నిరోజుల క్రితం భవ్య, మెహ్రీన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. పెళ్లి తర్వాత మెహ్రీన్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement