Friday, November 22, 2024

ఫ్రీగా.. యోగా..

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఫిట్ నెస్ గురించి అందరికీ తెలిసిందే. నిత్యం జిమ్ తో పాటు యోగాని కూడా చేస్తుందీ సీనియర్ భామ. అయితే ఇకపై ఒక సంవత్సరం పాటు ఫ్రీగా యోగా క్లాసులు చెబుతానని చెప్పింది మలైకా. అంతేనా ఒక అద్భుతమైన యోగాసనం గురించి వివరించింది కూడా. కొన్నిసార్లు ఇది మీ పరిమితులను దాటి మీకు నచ్చినదాన్ని చేయడం.. స్వేచ్ఛగా ఉండటం..  లేదా ఏదో ఒక దిశలో కదలడం. కాబట్టి ఈ వారం మలైకా మూవ్ ఆఫ్ ది వీక్..ని పరిచయం చేస్తున్నాం! అంటూ ఇలా స్పెషల్ భంగిమను మలైకా షేర్ చేశారు. మీరు ఇష్టపడే కదలికను అనుసరించడం ద్వారా మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా మలుచుకోండి. ఈ వారం మీ ప్రత్యేకమైన యోగాసనాన్ని మాతో పంచుకోండి.. మీరు మీ యోగాసనాన్ని షేర్ చేసినపుడు నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు! అంటూ తనదైన ప్రచారం ప్రారంభించింది. ముంబైలో ప్రముఖ యోగా స్టూడియోస్ తో కలసి మలైకా ఉచిత యోగా క్లాసులు ప్రారంభించింది.అంతేకాదు.. మలైకా బయోలో లింక్ క్లిక్ చేసి ఒక సంవత్సరం ఉచిత యోగా ప్రోగ్రామ్ ను గెలుచుకునే అవకాశాన్ని పొందండి.. అంటూ ఆఫర్ చేసింది. మొత్తానికి యోగా ప్రియులకు ఇది శుభవార్తనే. ఇకపై మలైకా యోగా క్లాసులను రెగ్యులర్ గా ఫాలో చేసే సువర్ణాకాశం లభించినట్టే.  బాలీవుడ్ లో యోగా అనగానే శిల్పాశెట్టి పేరే గుర్తుకు వస్తుంది. ఇటీవల మలైకా కూడా తనదైన శైలిలో పాపులారిటీ పెంచుకుంటోంది. ఇక మలైకా డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది కూడా.

Advertisement

తాజా వార్తలు

Advertisement