క్రైం బ్రాంచ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. నకిలీ ఈ మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ శనివారం ఫిబ్రవరి 27న ముంబై పోలీసు కమీషనర్ ఆఫీసు ముందు హాజరయ్యారు. 2016ఫిర్యాదుకు సంబంధించిన కేసులో ఆయన క్రైం బ్రాంచ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. హీరోయిన్ కంగనా రనౌత్‌కు బోగస్ ఐడీ ద్వారా ఈమెయిల్స్ చేసినట్లు హృతిక్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆ ఏడాది కంగనా, హృతిక్ మధ్య సోషల్ మీడియాలో గొడవ నడిచింది. కంగనాపై ఓ దశలో హృతిక్ అనుచిత కామెంట్ చేశారు. లీగల్ నోటీసులు కూడా ఆమెకు పంపారు. కంగనాతో తనకు ఎటువంటి రిలేషన్‌షిప్ లేదని, ఆమె కూడా తనకు వందల సంఖ్యలో మెయిల్స్ పంపినట్లు హృతిక్ వెల్లడించారు. కానీ తన పేరుతో ఎవరో కంగనాకు మెయిల్స్ పంపుతున్నారని హృతిక్ ఫిర్యాదు చేశాడు. 2013 నుంచి 2014 మధ్య కాలంలో ఆ మెయిల్స్ వెళ్లినట్లు ఆయన తెలిపాడు. హృతిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేశారు. 2016లో సైబర్ సెల్.. హృతిక్ ల్యాప్‌టాప్, ఫోన్‌ను సీజ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement