త్వరలోనే శుభవార్త రావొచ్చేమో అన్నారు తమిళ స్టార్ హీరో విశాల్. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు విశాల్. పెళ్లిపై కూడా స్పందించారు. త్వరలోనే శుభవార్త రావొచ్చేమో అన్నారు.నేను దర్శకుడిని కావాలనుకున్నా. అందుకే మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యా. ఆ తర్వాత నటుడిగా మారి 16 సంవత్సరాల నుంచి కెరీర్‌ను కొనసాగిస్తున్నా. ఆ తర్వాత నిర్మాతగా మారా. ఆ తర్వాత దర్శకుడినయ్యా. నా జీవితంలో నేను ఏదీ ప్లాన్ చెయ్యలేదు. అలాగే పెళ్లి గురించి కూడా నాకు ప్లానింగ్ లేదు. సమయం వచ్చినపుడు జరిగిపోతుంది. బహుశా ఒక ఏడాది తర్వాతో లేదా మరో సినిమా తర్వాతో శుభవార్త రావొచ్చేమోనని విశాల్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన అనీశాతో విశాల్‌కు 2019లో ఎంగేజ్మెంట్ అయింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి రద్దయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement