Friday, November 22, 2024

‘పుష్ప’ కోసం రెండు గంటల సేపు మేకప్

నేను నటించిన సినిమాల్లో పుష్ప చాలా విభిన్నమైనదని హీరోయిన్ రష్మిక మందన తెలిపింది.పుష్ప  సినిమా షూటింగ్ సమయంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నానని హీరోయిన్ రష్మిక పేర్కొంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న పీరియాడిక్ సినిమా పుష్ప. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. అక్కడి షూటింగ్ అనుభవాలను తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లోపుష్ప` చాలా విభిన్నమైనది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నా. మేకప్‌ వేసుకునేందుకే దాదాపు రెండు గంటల సమయం పట్టేది. ఇక, షూటింగ్ లొకేషన్‌కు చేరుకునేందుకు కూడా చాలా సమయం పట్టేది. రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. మా కష్టాన్ని అందరూ స్క్రీన్‌పై చూస్తారు. ఇక, బన్నీతో కలిసి నటించడం చాలా గొప్పగా అనిపించిందని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement