Friday, September 20, 2024

‘పవన్’ షూట్ నుండి పిక్ లీక్

డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న చిత్రం హరి హర వీరమల్లు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు ఏఎమ్ రత్నం. కాగా ఈ మూవీలో హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.  మొఘల్ కాలం నాటి కథతో రూపొందుతోందీ మూవీ. ఈ చిత్రం కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు పవన్ హాజరవుతున్నారు. షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో పవన్ జానపద తరహా దుస్తులు ధరించి ఉన్నారు. ఈ ఫొటోను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా అప్‌డేట్ రాబోతోంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకు స్వరాలందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement