Friday, November 22, 2024

పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే నాలుగో భార్య అవుతా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటి అషూరెడ్డి వీరాభిమాని అని తెలిసిన విషయమే. గతంలో ఆమె పవన్ పేరును తన ఒంటిపై పచ్చబొట్టు కూడా వేయించుకుంది. తన ఫస్ట్ లవ్ పవన్ కళ్యాణే అని ఆమె ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. ఆమె ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా పవన్ కళ్యాణ్‌ను స్వయంగా కలిసి మాట్లాడింది. ఈ సందర్భంగా పవన్‌తో దిగిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఈరోజు నా దేవుడిని కలుసుకున్నాను. ఇటీవల నేను వేయించుకున్న పచ్చబొట్టు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. తిరిగి వచ్చేటప్పుడు ఆయన స్వహస్తాలతో రాసిన ఓ లెటర్ ఇచ్చారు. అందులో మీరు కోరుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నట్లు రాశారు. ఈ అవకాశం కల్పించిన దర్శకుడు క్రిష్‌కు కృతజ్ఞతలు’ అని పేర్కొంది.

కాగా పవన్ రాసిన లెటర్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన అషూరెడ్డికి పలువురు పవర్ స్టార్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఆమెను ‘పవన్ నాలుగో భార్యగా ఉండటానికి అవకాశం వస్తే ఒప్పుకుంటారా’ అని ప్రశ్నించాడు. దీనిపై అషూరెడ్డి స్పందిస్తూ తప్పకుండా ఒప్పుకుంటానంటూ సదరు నెటిజన్‌కు సమాధానం ఇచ్చింది. దీంతో అషూరెడ్డి సమాధానం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement