Wednesday, September 18, 2024

‘పవన్ కల్యాణ్’ తో ‘హిమజ’

పవర్ స్టార్ కి అభిమాని కానివారెవరు..ఆయనతో ఫొటో దిగేందుకు అందరూ ఉత్సూకతని చూపిస్తుంటారు. అయితే రీసెంట్ గా నటి హిమజ..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి సెల్ఫీ దిగింది. బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక హిమ‌జ లైఫ్ పూర్తిగా మారింది. ల‌గ్జ‌రీ కారు మెయింటైన్ చేస్తూ విలాస‌వంత‌మైన జీవితం గడుపుతుంది. ప‌లు సినిమాల‌లోను న‌టిస్తున్న హిమ‌జ  త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఎప్పుడు ట‌చ్‌లోనే ఉంటుంది.హిమ‌జ రీసెంట్‌గా మ‌హేష్ బాబుతో దిగిన ఫొటోని త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా, ఇది వైర‌ల్‌గా మారింది. ఇక తాజాగా ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఏదో సంద‌ర్భంలో క‌లిసి అతనితో ఫొటో దిగింది. ఓ ఫొటోలో ప‌వ‌న్ సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తుండ‌గా, మ‌రో ఫొటోలో చిరుమంద‌హాసంతో క‌నిపించారు. ఈ ఫొటోలు నెటిజ‌న్స్‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement