Saturday, November 23, 2024

‘పవన్ కల్యాణ్’ తో కలిసి నటిస్తా..

రీసెంట్ గా స్టార్ కమెడియన్..నటుడు ఆలీ ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ లో మెరిసారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దాంతో వారిద్దరూ మళ్లీ కలిసిపోయారు. పవన్ కల్యాణ్ తో త్వరలోనే కలిసి నటిస్తానని చెప్పాడు ఆలీ. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలీ..పవన్ కల్యాణ్ తో ఉన్న విభేదాల గురించి మాట్లాడారు. సుస్వాగతం చిత్రంతో మా స్నేహం ప్రారంభమైంది. ఇప్పటివరకూ పవన్ 27 సినిమాలు చేస్తే.. 25 చిత్రాల్లో నేను ఉన్నాను. మా ఇద్దరి మధ్య రాజకీయపరంగా తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలూ లేవు. ఇటీవల మా బంధువుల పెళ్లిలో పవన్‌ను కలిశాను. చాలా సంతోషంగా అనిపించింది. రాజకీయాలు, కరోనా కారణంగా ఏడాదిన్నర నుంచి ఆయణ్ని కలవలేకపోయాను.  మధ్యలో ఒకసారి ఆయణ్ని కలుద్దామని ఇంటికి వెళ్లాను. అప్పుడు ఆయన పుణెలో ఉన్నారని తెలిసి వచ్చేశాను. పవన్ మళ్లీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాదే పవన్ సినిమాలో నేను కనిపిస్తానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement