మాస్ మహారాజ్ రవితేజ నిర్మాతగా మారనున్నాడు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి, కొత్త కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడానికి నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా తనే నిర్మాతగా మారుతున్నాడట. రవితేజ నిర్మాతగా మారుతాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు ‘ఆర్టీ వర్క్స్’ పేరుతో రవితేజ బ్యానర్ పేరుని రిజిష్టర్ చేయించాడట. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలను రవితేజ నిర్మిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement