Friday, November 22, 2024

నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు..’శృతిహాసన్’

2017లో నేను చేసిన ట్వీట్ ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది హీరోయిన్ శృతిహాసన్.. ప్రతి భాషపై, దర్శక నిర్మాతలపై, నటీనటులపై నాకు గౌరవం ఉంది. గతంలోనే నేను ఓ కన్నడ సినిమా చేయాల్సింది. కాకపోతే డేట్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో కుదరలేదు. ఇప్పుడు సలార్ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలో భాగం కావడం నాకెంతో ఆనందంగా ఉంది. అన్ని భాషల్లోనూ నటించాలని తను కోరుకుంటానని చెప్పింది. నాలుగేళ్ల క్రితం చేసిన ట్వీట్‌పై ప్రస్తుతం విమర్శలు చెలరేగుతుండడంతో శృతి  హాసన్ స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. కన్నడ సినిమాల్లో ఎప్పుడు నటిస్తారనే అభిమాని ప్రశ్నకు శ్రుతి 2017లో స్పందిస్తూ.. తాను కన్నడ సినిమాలు చేయనని, ఆ అవకాశమే లేదని సమాధానమిచ్చింది. అయితే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సలార్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి నటిస్తోంది. దీంతో గతంలో చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ పలువురు కన్నడ అభిమానులు శృతిని విమర్శిస్తున్నారు. వాటిపై వివరణ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement