Friday, November 22, 2024

నా అతిపెద్ద బలం మీరే..మీ ఇద్దరికీ 42వ పెళ్లిరోజు శుభాకాంక్షలు

నా అతి పెద్దబలం మీరే అంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన తల్లిదండ్రులు  మెగాస్టార్ చిరంజీవి..సురేఖలకు  సోషల్ మీడియా ద్వారా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రామ్ చరణ్. 42వ వార్షికోత్సవం జరుపుకుంటున్న చిరంజీవి, సురేఖ దంపతులకు విషెస్ చెప్పాడు. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. నేటితో ఫిబ్రవరి 20న  42 ఏళ్లు పూర్తయ్యాయి. నా అతిపెద్ద బలం. మీ ఇద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని రామ్‌చరణ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న చరణ్ తన తర్వాతి సినిమా కోసం సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement