Monday, November 25, 2024

‘దేవినేని’ చిత్రం వల్ల ఎవరికీ ఇబ్బంది కలగదు..

సినిమా చూసి అభ్యంతరాలు ఉంటే చెప్పండని అన్నారు దర్శకుడు నర్రా శివనాగు. ఈ చిత్రంలో హీరోగా నందమూరి తారకరత్న నటిస్తున్నారు. కాగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ..వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి..చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటిస్తున్నాడు. విజయవాడలో ఇద్దరు మహా నాయకుల మధ్య స్నేహం..వైరంతో పాటు కుటుంబ బంధాల కలయికలో డైరెక్టర్ నర్రా శివనాగు రూపొందించిన చిత్రమే దేవినేని. జీఎస్ ఆర్..రాము రాథోడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు నర్రా శివనాగు మాట్లాడుతూ ఇది దేవినేని నెహ్రూ ఒరిజినల్ బయోపిక్ కానే కాదన్నారు. డైరెక్టర్ గా..కథకుడిగా నేను ఊహించి రాసుకున్న కథ. ఇది ఏ రాజకీయనాయకుడికీ సంబంధించిన కథ కానే కాదన్నారు. అయినా కొందరు విమర్శలు చేస్తున్నారు. దేవినేని` సినిమా వల్ల ఏ రాజకీయ నాయకుడికీ ఎలాంటి ఇబ్బందీ కలగదు. ఇది బయోపిక్ కాదనే విషయాన్ని అందరూ తెలుసుకోండి. మీకు మీరుగా ఏవేవో ఊహించుకోకండని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement