పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్. 46 ఏళ్ల తర్వాత అదే లొకేషన్‌కు వచ్చాను పాత కెరీర్ తొలినాళ్లలో నటించిన ఒక లొకేషన్‌కు మళ్లీ షూటింగ్ కోసం రావడం మధురానుభూతిని కలిగించిందని అమితాబ్ పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు అజయ్ దేవ్‌గణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం `మే డే`. ఈ సినిమాలో అజయ్‌తో కలిసి అమితాబ్ నటిస్తున్నారు. ముంబయిలోని ఓ ప్రాచీన భవనం దగ్గర తాజాగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. 1975లో ఇదే లొకేషన్లో `దీవార్` సినిమా చిత్రీకరణలో పాల్గొన్నట్టు సోషల్ మీడియా ద్వారా అమితాబ్ తెలిపారు. “దీవార్` సినిమాలో రవివర్మ (శశికపూర్) తన సోదరుడు విజయ్ (అమితాబ్)ని షూట్ చేసే సన్నివేశం ఇక్కడే చిత్రీకరించారు. ఇప్పుడు అక్కడే మేడే షూటింగ్ జరుగుతుండటం గొప్ప అనుభూతి అని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement