దర్శకుడు తేజ పుట్టినరోజు నేడు ఫిబ్రవరి22న. ఆయన బర్త్ డేకి కొత్త సినిమాను ఎనౌన్స్ చేశాడు.దివంగత నటుడు ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం సినిమాకి సీక్వెల్ రానుంది. హీరో రానాతో ఓ సినిమా ఉంటుందని ప్రకటించిన దర్శకుడు తేజ తాజాగా చిత్రం సినిమా సీక్వెల్‌ను తన బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేశారు. చిత్రం 1.1 పేరుతో రూపొందనున్న ఈ చిత్రం 2021లోనే షూటింగ్ జరుపుకోనుంది. తొలి పార్ట్‌కు సంగీతం అందించిన ఆర్పీ పట్నాయక్ ఇప్పుడు సీక్వెల్‌కు సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు.నటీనటులు ఎవరనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. అయితే తేజ తెరకెక్కించిన చిత్రం మూవీ 2000 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాగా, గత ఏడాది జూన్ 16కు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన మూవీ ఉదయ్ కిరణ్, రీమాసేన్, ఆర్.పి.పట్నాయక్, రసూల్ ఎల్లోర్ వంటి వారి కెరీర్‌కు పునాది వేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement