Thursday, September 19, 2024

‘తెల్లవారితే గురువారం’ ఫస్ట్ లుక్

హీరో శ్రీసింహ బర్త్ డే నేడు ఫిబ్రవరి 23న. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహ కోడూరి. మ‌త్తు వ‌ద‌ల‌రా అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించ‌డంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. ప్ర‌స్తుతం తెల్ల‌వారితే గురువారం, భాగ్ సాలే అనే చిత్రాలు చేస్తున్నారు శ్రీ సింహ‌. ఈ రోజు ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా తెల్లవారితే గురువారం చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో పెళ్లి కొడుకు గెట‌ప్‌లో ఉన్న శ్రీ సింహ సిగ‌రెట్ తాగుతూ క‌నిపించారు. ఈ చిత్రాన్ని మ‌ణికాంత్ జెల్లి తెర‌కెక్కించారు.ఇక శ్రీ సింహ హీరోగా భాగ్ సాలే అనే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతుంది.  ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్ భాగస్వామ్యంలో మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు ప్రణీత్ బ్రమాండపల్లి  చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న “భాగ్ సాలే”   మార్చి మూడో వారం నుంచి   రెగ్యులర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement