Friday, November 22, 2024

తల్లికి బర్త్ డే విషెస్ తెలిపిన ‘రామ్ చరణ్’

తన తల్లి సురేఖకి బర్త్ డే విషెస్ తెలిపాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్  చిరంజీవి, సురేఖ‌ల ముద్దుల త‌న‌యుడు రామ్ చ‌రణ్ తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో త‌ల్లితో దిగిన ఫొటో షేర్ చేస్తూ బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. నీ అమిత‌మైన ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు. అమ్మ నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేశాడు. రామ్ చ‌ర‌ణ్ చేసిన ట్వీట్ నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అలానే తల్లితో దిగిన మెమోర‌బుల్ ఫొటో కూడా ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న ఆచార్య చిత్రానికి సురేఖ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా మ్యాట్నీ మూవీస్ – కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి – చరణ్ కలిసి నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement