హీరో అల్లరి నరేశ్ నాంది చిత్రంలో జైలు శిక్ష అనుభవించే ఖైదీగా కనిపించబోతున్నాడు . ఈ రోల్ కోసం నరేశ్ చాలానే కష్టపడినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో నరేశ్ సెల్లో తలకిందులుగా ఉండే సీన్ ఒకటి ఉండగా..దానికి డబ్బింగ్ చెప్పాడు. సన్నివేశానికి తగ్గట్టుగా తన వాయిస్ సహజసిద్దంగా ఉండాలనుకున్న నరేశ్..ఆ రోల్ కోసం నిజంగానే తలకిందులుగా ఉండి డబ్బింగ్ చెప్పాడు.డబ్బింగ్ థియేటర్లో ఓ వ్యక్తి నరేశ్ చేతులు పట్టుకోగా..అతడు శరీరాన్ని వెల్లకిలా వంచి డబ్బింగ్ చెప్పిన వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. డెడికేషన్ కు కేరాఫ్ అల్లరినరేశ్. ఓ ప్రత్యేకమైన సీన్ కోసం అల్లరి నరేశ్ చెప్తున్న డబ్బింగ్ సినిమాపై అతనికున్న మక్కువను తెలియజేస్తుందని ట్వీట్ లో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement