తన బిడ్డ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది హీరోయిన్ అనిత. రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని వివాహమాడిన హీరోయిన్ అనిత రీసెంట్గా బేబి బాయ్‌కు జన్మనిచ్చింది. తమకు మగ బిడ్డ జన్మించారని అనిత దంపతులు కొద్ది రోజుల క్రితం తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేయగా, రీసెంట్గా బేబి ఫొటో షేర్ చేశారు. ఇందులో చిన్నారి ఫేస్ కనిపించకుండా కవర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వు నేను చిత్రంలో ఉదయ్ కిరణ్ సరసన నటించిన అందాల ముద్దుగుమ్మ అనిత. ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషలలో పలు సినిమాలలో నటించగా, పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ పలు సీరియల్స్‌లో నటిస్తూ పాపులారిటీ తెచ్చుకుంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement