జూన్ 4న 83 మూవీ రిలీజ్ కానుందని తెలిపారు చిత్ర యూనిట్. కపిల్‌దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983 సంవత్సరంలో విశ్వవిజేతగా ఆవిర్భవించి దేశ క్రికెట్‌లో నవ శకానికి నాంది పలికింది. ఆనాటి భారత టీమ్ అసాధారణ ప్రయాణాన్ని వెండితెర దృశ్యమానం చేస్తూ 83 మూవీని తెరకెక్కించారు దర్శకుడు కబీర్ ఖాన్ . అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 4న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయనున్నారు. విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మించిన కపిల్ బయోపిక్‌లో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ గా నటిస్తుండగా ఆయన భార్య పాత్ర దీపికా పదుకొనె చేయడం విశేషం. సునీల్ గవాస్కర్ పాత్రలో బాలీవుడ్ నటుడు తాహీర్ రాజ్ భాసిన్, అప్పటి జట్టు మేనేజర్ మాన్ సింగ్ పాత్రలో పంకజ్ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్ పాటిల్ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్ పాటిల్, శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్ కిర్మాణిగా సాహిల్ ఖట్టర్, బల్వీందర్ సింగ్‌గా అమ్మీ విర్క్ కనిపించబోతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement