Friday, November 22, 2024

జిమ్ లో రాజీ పడని ‘మహేష్ బాబు’

దుబాయ్ లో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు వర్క్ వుట్స్ చేస్తున్నారు.  మహేష్ బాబుకు వయసుతోపాటే అందం కూడా పెరుగుతోంది. రోజురోజుకూ మహేష్ మరింత ఫిట్‌గా తయారవుతున్నాడు. అందుకోసం మహేష్ ఎంతో కష్టపడుతున్నాడు. కఠినమైన వర్కవుట్స్, డైటింగ్ చేస్తూ తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటున్నాడు. ప్రస్తుతం పరశురామ్ రూపొందిస్తున్న సర్కారు వారి పాట కోసం దుబాయ్‌లో ఉంటున్న మహేష్ అక్కడకు కూడా తన జిమ్ ట్రైనర్‌ను తీసుకెళ్లాడు. అతడి పర్యవేక్షణలో వర్కవుట్స్ చేస్తున్నాడు. మహేష్ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను ట్రైనర్ మనీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సర్కారు వారి పాట చిత్రీకరణ కోసం దుబాయ్‌ వచ్చిన మహేష్ నెలలో ఒక్కరోజు కూడా జిమ్‌ను స్కిప్ చేయలేదని, పగలంతా షూటింగ్‌లో ఎంత కష్టపడినా సాయంత్రం జిమ్‌లో మాత్రం రాజీ పడరని, అందుకే అందరి వయసూ పెరుగుతున్నా మహేశ్‌ వయసు మాత్రం తగ్గుతోందని మనీష్ తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement