Saturday, November 23, 2024

చెప్పులు లేకుండా 6కి. రన్నింగ్

చెప్పులు లేకుండా 6కిలోమీటర్లు రన్నింగ్ చేశారు బాలీవుడ్ నటుడు..మోడల్ మిలింద్ సోమన్. దాంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. తనకు నచ్చిన రోడ్డుపై కాళ్లకు చెప్పుల్లేకుండా ఆరు కిలోమీటర్ల దూరం నడిచానని మిలింద్ సోమన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోతోపాటు పోస్టు పెట్టారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రజలు వ్యాయామం చేయాలని మిలింద్ సోమన్ సూచించారు. మైదానం కొంచెం వేడిగా ఉన్నా తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు 6 కిలోమీటర్లు మాత్రమే నడిచాను అంటూ మిలింద్ సోమన్ వ్యాఖ్యానించారు.ప్రజలు వ్యాయామం చేసేందుకు సమయం లేదని అంటుంటారని, కాని అది నిజం కాదని ఫిట్ నెస్, ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి అని మిలింద్ పేర్కొన్నారు. తన భర్త అయిన మిలింద్ పెట్టిన పోస్టును అతని భార్య అంకిత లైక్ చేస్తూ స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement